Notifications

S.R.Education Updates: ఎండోమెంట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు

ముందస్తుగా ఇలా సిద్ధం కండి
దేవాదాయ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం అనేది ఎంతో గౌరవప్రదమైనది.అలాంటి అవకాశం కలిగించే పరీక్షే  - APPSC/TGPSC Endowment Officers Recruitment. 
అభ్యర్థులు ఇప్పటి నుంచే సరైన సన్నద్ధతతో మొదలు పెడితే ఈ పరీక్షలో విజయం సాధించవచ్చు.
పరీక్ష నిర్వహణ సంస్థ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)/తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC).
జాబ్ పేరు : Executive Officers in A.P. Endowments Sub -Service/TG Endowments Sub-Service.
నోటిఫికేషన్ వస్తే జిల్లా వారీగా ఖాళీలకు అనుగుణంగా నియామకాలు జరుగుతాయి. ఏపీలో వీటికి సంబంధించి ఖాళీల గురించి గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అందకపోవడం వలన ఏపీపీఎస్సీ ఈ రిక్రూట్మెంట్ చేపట్టలేదు. అలాగే తెలంగాణలో కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఖాళీలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. ఏపీలో అభ్యర్థులు 18 - 42 ఏళ్ల మధ్య, తెలంగాణలో అభ్యర్థులు 18 - 46 ఏళ్ల మధ్య వయసు వారు అర్హులు. SC/ST/BC/PH/Ex Service అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం: ప్రిలిమినరీ (ఒకే పేపర్)+ మెయిన్స్ (2 పేపర్లు)

ఏం చదవాలి?


పేపర్ -1 జనరల్ స్టడీస్: కరెంట్ అఫైర్స్ (రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు), భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ చరిత్ర, భారత రాజ్యాంగం & పాలన, భారత ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ / తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, జనరల్ మెంటల్ ఎబిలిటీ, సాంఘిక సమస్యలు, ప్రభుత్వ పథకాలు, భారతీయ భూగోళ శాస్త్రం, పర్యావరణం, డిజాస్టర్ మేనేజ్ మెంట్, జనరల్ సైన్స్ మరియు దైనందిన అనువర్తనాలు వంటి అంశాలు చదవాలి.

Paper-2: హిందూ ధర్మతత్వం & దేవాలయ వ్యవస్థ

ఈ పేపరకు సంబంధించి రామాయణం, మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలు, దేవాలయ వ్యవస్థ, ఆగమ సాంప్రదాయాలు, హిందువుల పండుగలు, సాంప్రదాయ కళలు, వైదిక సంస్కృతి, హిందూ మతంలో వివిధ తత్వాలు - శాఖలు మరియు తత్వవేత్తలు, హిందూ కుటుంబ వ్యవస్థ, దేవాలయాలు, చారిటబుల్ సంస్థల ఆదాయ వనరులు -నిధుల పంపిణీ, హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ చట్టాలు, ఎండోమెంట్ యాక్ట్, కార్యనిర్వహణ అధికారి విధులు మొదలైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ప్రిపరేషన్ స్ట్రాటజీ

తెలుగు మాధ్యమం అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఎందుకంటే రెండో పేపర్ ఎక్కువగా తెలుగు పాఠ్యాంశాలతోనే ఉంటుంది. పురాణాలు, ఇతిహాసాలు (రామాయణం, మహాభారతం, 18 మహాపురాణాలు) గురించి ప్రాథమిక అవగాహన అవసరం . AP Endowments Acts & Temple Administrationపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. ప్రతి రోజు 6-8 గంటలు చదవాలి. మునుపటి ప్రశ్న పత్రాలు విశ్లేషించాలి. మోడల్ టెస్ట్, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం తప్పనిసరి.

ప్రత్యేకంగా ప్రిపేర్ కావాల్సిన అంశాలు:


» హిందూ మత మౌలిక సిద్ధాంతాలు

>> దేవాలయ సంస్కృతి, ఆచారాలు

> రామాయణం -ఆదికావ్యం (అధ్యాయాల వారీగా)

» 18 మహాపురాణాల ముఖ్యాంశాలు

» శంకరాచార్యులు, రామానుజులు వంటి మతసంస్కర్తల జీవితం

» దేవాదాయ శాఖ చట్టాలు & పరిపాలన విధానాలు

పూర్తి వివరాలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్గా ఇస్తాము. అభ్యర్థులు గమనించగలరు. ముందస్తు ప్రిపరేషన్ కోసం ఇక్కడ మీకు తెలియజేయడం జరిగింది. ముందస్తు ప్రణాళికతో సన్నద్ధమైతే రాబోయే నోటిఫికేషన్లో విజేతలు మీరే.

కామెంట్‌లు

Popular Articles

కరెంట్ అఫైర్స్ (ఆగస్టు 17, 2025)

అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్లు.. ఈనెల 13 వరకే ఛాన్స్

AP & TS TET/DSC Preparation Guide (Syllabus + Books + Strategy)

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్) ఉద్యోగాలు